Samsung Galaxy F05: ఎక్కువ ఫీచర్లు.. ధర కేవలం రూ. 6,499 మాత్రమే.! 5 d ago

స్మార్ట్‌ఫోన్ రంగంలో శామ్‌సంగ్ గెలాక్సీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. శామ్‌సంగ్ బ్రాండ్ ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకర్షిస్తూనే ఉంటుంది. శామ్‌సంగ్ మొబైల్స్ చూడడానికి అద్భుతంగా.. వాడుకోవడానికి అనుకూలంగా.. జేబులో సొమ్ముకు తగ్గట్టుగా ఉంటాయి. అసలు Samsung Galaxy F05 ఫోన్ అయితే మధ్యతరగతి కుటుంబానికి ఒక సూపర్ ఎంపికనే చెప్పాలి.. ఎందుకంటే ఈ ఫోన్ కేవలం రూ.6 వేలకే మంచి ఫీచర్లతో అందుబాటులో ఉంది. ఒకటి కాదు.. రెండు కాదు ఇన్ని మంచి ఫీచర్లతో వచ్చిన దీనిని ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ అంటే ఎవరు నమ్మరు. ఒకసారి ఈ ఫోన్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం రండి!
Samsung Galaxy F05 ఫీచర్లు:
ప్రాసెసర్: MediaTek Helio G85
డిస్‌ప్లే: 6.7-అంగుళాల HD+ PLS LCD
రిఫ్రెష్ రేట్: 60Hz
బ్యాక్ కెమెరా: 50MP మెయిన్ కెమెరా + 2MP డెప్త్ సెన్సార్
ఫ్రంట్ కెమెరా: 8MP
బ్యాటరీ: 5000mAh
ఛార్జింగ్: 25W ఫాస్ట్ ఛార్జింగ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 14, Samsung One UI
4GB RAM + 64GB స్టోరేజ్
కనెక్టివిటీ ఫీచర్లు:
- బ్లూటూత్ 5.3
- USB టైప్-C పోర్ట్
- Wi-Fi 5
- 4G డ్యూయల్ సిమ్
లోపాలు:
ఈ ఫోన్ కు 5G నెట్‌వర్క్ సపోర్ట్ లేదు. ఇది కేవలం బ్లూ రంగుతో..ఒక వేరియంట్ లోనే వస్తుంది. గేమింగ్ కి ఈ ఫోన్ పనికిరాదు.
Samsung Galaxy F05 లో పెద్ద పెద్ద అప్డేట్స్ లేకపోయినా... ఇది రోజువారీ అవసరాలకు సరిపోతుంది. ఈ ఫోన్ కేవలం రూ.6,499 కే ఆఫ్‌లైన్ & ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. దీనిలో 5G, హెచ్‌డి+ స్క్రీన్ లేకపోవడం వంటి లోపాలు ఉన్నా, బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు కావాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక. మీరే ఆలోచించండి అసలు రూ.10 వేల లోపు ఇంత మంచి ఫోన్ ఎక్కడైనా వస్తుందా? త్వరపడండి. రోజువారి అవసరాలకు ఒక ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ కావాలనుకుంటే ఇదే బెస్ట్ ఛాయిస్.
ఇది చదవండి: రూ.15 వేల లోపు 5G స్మార్ట్‌ఫోన్‌లు… ఏ ఫోన్ కొనాలి?